Header Banner

ప్రధాని మోడీ కీలక సమావేశం.. ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్! ఎప్పుడు అంటే.?

  Wed May 14, 2025 11:10        Politics

ఆపరేషన్ సిందూర్‌తో దాయాదికి చుక్కలు చూపించిన తర్వాత ఎన్డీఏ కీలక భేటీ కానుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ నెల 25న సమావేశం జరగనుంది. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు సైతం ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి గల ముఖ్య ఉద్దేశాన్ని ఎన్డీఏ నేతలకు వివరించనున్నట్లు సమాచారం. ఆపరేషన్‌లో ఉగ్రవాద శిబిరాలపై చేసిన దాడుల గురించి వివరించే అవకాశం ఉంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు దేశ వ్యాప్తంగా రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి ప్రశంసలు లభించాయి. ప్రతిపక్ష నేతలు సైతం ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు. అయితే భారత ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించడంతో ఎన్డీఏ ప్రభుత్వంపై విపక్షాల నుంచి విమర్శలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్, అనంతర పరిణామాలపై ఎన్డీఏ నేతలకు అవగాహన కల్పించడం ద్వారా విమర్శలను తిప్పికొట్టేలా చేయాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎన్డీఏ కీలక భేటీ జరగనుంది. ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని మరోసారి స్పష్టం చేయనున్నారు. ఈ కీలక భేటీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరుకానున్నట్లు సమాచారం. 

 

ఇది కూడా చదవండి: 22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి మరో బిగ్ షాక్‌! కీలక నేత పార్టీకి రాజీనామా!

 

నమ్మి మోసపోయాను..! కొడాలి నానిపై వైసీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు!

 

ఏపీకి క్యూ కట్టనున్న కంపెనీలు.. ఎన్నో తెలుసా? నారా లోకేష్ కీలక ప్రకటన!

 

ఎలుకలన్నీ ఘోషించినా వేస్ట్.. పవన్ కల్యాణ్ ఓ ఆసక్తికర ట్వీట్ వైరల్!

 

జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడి అరెస్టు!

 

ఏపీ రాజకీయాల్లో విషాదం! గుండె పోటుతో కుప్పకూలిన మాజీ ఎంపీ!

 

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. సీట్లన్నీ ఏపీ వాళ్లకే.. ఉత్తర్వులు జారీ!

 

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Modi #Delhi #Pawankalyan